
సుకుమార్(Sukumar)..ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా డైరెక్టర్ అనే పేరే కాదు. పాన్ ఇండియా ప్రేక్షకులు సుకుమార్ సినిమా ఎప్పుడు సెల్యులాయిడ్ పై ఎంటర్ ఇస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి. ఓవర్ నైట్ ఆ స్థాయిని సంపాదించుకోలేదు. రెండు దశాబ్డల కష్టం ఉంది. అసలు రోజులో రెండు గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా సమయం మొత్తం సినిమా గురించే ఆలోచిస్తాడు. అందుకే పాన్ ఇండియా కట్ అవుట్ కి సూటయ్యాడు. వైవిధ్యమైన కథ, కథనానికి కూడా పెట్టింది పేరు. అలాంటి సుకుమార్ కి కథ చెప్పడం రాదని ఒక హీరో అంటున్నాడు. ఆ హీరో ఎవరో చూద్దాం
జగపతి బాబు(Jagapathi Babu).. టాలీవుడ్ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే గాని ఇలాంటి నటుడు పుట్టడు. ఈ నెల 8 న 'గోదారి గట్టుపైన’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్లలో మాట్లాడుతు సుకుమార్ నాన్నకు ప్రేమతో కథ చెప్పడానికి తడబడ్డాడు. ‘రంగస్థలం’ కథని కూడా వివరించడానికి గంటన్నర యోగా చేసి వచ్చి, చివరికి ఒక్క నిమిషంలోనే ముగించాడు.అసలు సెట్ లో సీన్ పేపర్ ఇచ్చే వరకు నా క్యారక్టర్ తీవ్రత తెలియలేదు. సుకుమార్ కి ఒక కథని ఎగ్జైటింగ్‌గా నేరేట్ చేయడం అస్సలు రాదు. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఏదో గందరగోళంగా చెబుతుంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ, ఆయన మేకింగ్, విజన్ మీద నమ్మకం ఉంది. ఆయన ఏం తీస్తున్నారో ఆయనకి క్లారిటీ ఉంటుంది. అది చాలు. జగపతి బాబు పేర్కొన్నారు.
Aslo read: VIjay: విజయ్ సిఎం అవ్వడు!. ప్రముఖ హీరో శపధం
జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సుకుమార్‌ని విమర్శించడానికి చేసినవి కావు అని సరదాగా చేసినవని అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఎందుకంటే జగపతి బాబు అనే కట్ అవుట్ మంచి తనానికి, కల్మషం లేని మనసుకి ఫాంట్, షర్ట్ వేస్తే అది జగపతి బాబు. ప్రెజెంట్ సుకుమార్ సమర్పణలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ (Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)లో పవర్ ఫుల్ రోల్ లో జూన్ 4 న తన హవా చాటనున్నాడు.





.webp)

