
సంక్రాంతి బరిలోకి దిగుతోందంటే చాలు.. అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు పెరిగిపోతుంటాయి. అందులోనూ వెంకటేశ్, కల్యాణ్‌రామ్ లాంటి ఇద్దరు ప్రముఖ నటులు కలిసి నటిస్తుండటంతో ‘జనవరి 12 విడుదల’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజా ట్రేడ్ టాక్ ప్రకారం.. ‘జనవరి 12 విడుదల’ థియేట్రికల్ హక్కులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే వెంకటేశ్ కెరీర్లోనే ఇది అతిపెద్ద ప్రీ-రిలీజ్ డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా హక్కుల కోసం ఇతర ప్రాంతాలతో పాటు ఓవర్సీస్లోనూ బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించడం అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చింది. ‘ఎఫ్2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలతో ఆయనకు ఈ పండగ సీజన్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. వెంకటేశ్‌తో ఆయనకు ఉన్న విజయవంతమైన అనుబంధం కూడా ఈ కొత్త సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణం.
ఇప్పుడు తొలిసారి వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. కీర్తి సురేశ్, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్లోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రబృందం.. 2027 జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి సీజన్లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఇడుపు కాయితం’ సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ వేణు ఉడుగుల.!
[January 12 Vidudala Business, January 12 Vidudala Movie, Anil Ravipudi Sankranthi Movies, Victory Venkatesh, Nandamuri Kalyan Ram, Anil Ravipudi, Sankranthi 2027 Movies, Telugu Film News]






