Home

»

Latest News

Peddi: 'పెద్ది' ఆల్ టైమ్ రికార్డ్.. పవన్ కళ్యాణ్, ప్రభాస్ రికార్డులు బ్రేక్!

Jun 4, 2026 12:53PM

- కన్నడ గడ్డపై రామ్‌చరణ్ విధ్వంసం
- ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన పెద్ది
- పవన్ కళ్యాణ్, ప్రభాస్ లను వెనక్కి నెట్టిన చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర తన ఊరమాస్ పవర్ చూపిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ఒక రోజు ముందే, అంటే జూన్ 3 రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది. ముఖ్యంగా కన్నడ గడ్డపై రామ్ చరణ్ సృష్టించిన సంచలనం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 

కర్ణాటకలో పెద్ది సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. జూన్ 2 ఉదయం నాటికే కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఏకంగా ఒక కోటి రూపాయల మార్క్‌ను దాటేశాయి. ఇక జూన్ 3 రాత్రి ప్రీమియర్స్ ముగిసేసరికి కర్ణాటక వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 3.07 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అల్ టైమ్ ప్రీమియర్ రికార్డును నెలకొల్పింది. 

కర్ణాటకలో ఇప్పటివరకు ఉన్న తెలుగు సినిమాల ప్రీమియర్ రికార్డులను పెద్ది బ్రేక్ చేసింది. నిన్నటివరకు రూ.2.72 కోట్లతో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఉండగా, రెండో స్థానంలో రూ.2.61 కోట్లతో ప్రభాస్ 'ది రాజా సాబ్' ఉంది. ఇప్పుడు ఆ రెండు సినిమాలను వెనక్కి నెట్టి.. ఏకంగా రూ.3.07 కోట్లతో పెద్ది తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

కర్ణాటకలోనూ రామ్ చరణ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దానికితోడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం కూడా అక్కడ బిజినెస్ మరియు క్రేజ్ పెరగడానికి ఒక ముఖ్య కారణం అయింది.

బిజినెస్ లెక్కల విషయానికి వస్తే, కర్ణాటకలో 'పెద్ది' 17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి రావాలంటే దాదాపు 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రీమియర్ షోల ట్రెండ్ చూస్తుంటే మొదటి వారంలోనే ఈ టార్గెట్ దాటేలా కనిపిస్తోంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com