
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన బ్యూటిఫుల్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర, సీనియర్ యాక్టర్ సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపించి ఆడియన్స్‌ని కట్టిపడేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ సొంతం చేసుకుని, ఊహించని రేంజ్ లాభాలను మేకర్స్ కి అందించి ఈ ఏడాది సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు థియేటర్లలో అలరించిన ఈ ఎమోషనల్ రైడ్ డిజిటల్ స్క్రీన్స్ మీదకి ఎప్పుడు రాబోతోంది అనే దానిపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సెప్టెంబర్ 18 నుంచి 'ఇరుముడి' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రటన రానుంది.
థియేటర్లలో మిస్ అయినవారు, అలాగే మళ్లీ మళ్లీ ఈ ఎమోషనల్ డ్రామాను చూడాలనుకునేవారికి సెప్టెంబర్ 18 బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.
[Ravi Teja Irumudi, Irumudi OTT, Irumudi Netflix, Ravi Teja, Shiva Nirvana, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]






