Home

»

Latest News

బిగ్ అప్‌డేట్: త్వరలోనే థియేటర్లలోకి 'ఇండియన్ 3' మూవీ.!

Sep 10, 2026 7:01PM

విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇండియన్' (భారతీయుడు) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ గా భారీ అంచనాలతో వచ్చిన 'ఇండియన్ 2' దారుణంగా నిరాశపరిచింది. దాంతో 'ఇండియన్ 3'పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

గత కొంతకాలంగా 'ఇండియన్ 3' ప్రాజెక్ట్ గురించి రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సినిమా ఆగిపోయిందని, లేదా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే, ఈ వార్తలన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కీలకమైన అప్‌డేట్‌ను పంచుకుంది. ప్రస్తుతం 'ఇండియన్ 3'కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, మిగిలిన షూటింగ్ ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బిగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో 'వీరశేఖరన్' పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోంది. 'ఇండియన్ 2' ముగింపులోనే 'ఇండియన్ 3' గ్లింప్స్ చూపించిన శంకర్, ఈ మూడో భాగంలో వీరశేఖరన్ స్వాతంత్ర్య పోరాట నేపథ్యం, అప్పటి విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

 

 

 

[Indian 3 Movie, Kamal Haasan, Director Shankar, Indian 2 Movie, Lyca Productions, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com