శ్రీవిష్ణు వీడియో వైరల్.. ‘కన్నప్ప’ గురించి ఏమన్నాడంటే..?
on May 1, 2025
మీడియా విస్తృతం అయిపోయిన తర్వాత ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూసి భయపడడం, ఆందోళన చెందడం మనం చూస్తున్నాం. ఒక సమస్య ఎదురైతే దాన్ని పదిమందీ పది రకాలుగా చెప్పుకోవడం, చివరికి దాని స్వభావం మారిపోవడం కూడా మనం గమనిస్తున్నాం. ఈమధ్యకాలంలో ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్స్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటిదే ‘సింగిల్’ సినిమాకి సంబంధించి జరిగింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎంటర్టైన్మెంట్తోపాటు సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసే క్రమంలో కొన్ని పేరడీ డైలాగ్స్ వినిపించాయి. అలా ‘జై శివయ్యా..’, ‘మంచు కురిసిపోతుందని..’ అనే డైలాగ్స్ ఉన్నాయి.
కొన్ని డైలాగ్స్ కామెడీ కోసం, కొన్ని డైలాగ్స్ రైమింగ్ కోసం పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు డైరెక్టర్లు. సింగిల్ ట్రైలర్లో వినిపించిన డైలాగులు అలాగే ఉన్నాయి తప్ప ఎవరినీ హర్ట్ చేసే విధంగా లేవు. కానీ, సోషల్ మీడియా ఇప్పుడు ఉగ్రవాదుల్ని మించిపోయేలా ప్రతి విషయంపైనా కాంట్రవర్సీ బాంబులు వేసేస్తోంది. సింగిల్ సినిమా ట్రైలర్ చూసి మంచు విష్ణు హర్ట్ అయ్యాడని, దీనిపై కంప్లయింట్ చేసేందుకు అతను ఫిలింఛాంబర్కి బయల్దేరాడని.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు మంచు విష్ణు ఈ విషయంపై స్పందించలేదు. కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూసి భయపడిన ‘సింగిల్’ చిత్ర యూనిట్ అర్జెంట్‌గా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హీరో శ్రీవిష్ణు స్పందించాడు. తమ సినిమాలోని డైలాగ్స్‌పై వివరణ ఇచ్చాడు. పనిలోపనిగా ‘కన్నప్ప’ టీమ్‌కి సారీ చెప్పాడు.
‘‘ఇటీవల మా సింగిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాం. అందులో మేం వాడిన కొన్ని డైలాగ్స్ కారణంగా ‘కన్నప్ప’ టీమ్ హర్ట్ అయిందని తెలిసింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. కేవలం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చెయ్యడానికే ఆ డైలాగ్స్ పెట్టాం తప్ప ఎవరినీ హర్ట్ చెయ్యాలని కాదు. కానీ, ఆ డైలాగ్స్ తప్పుగా కన్వే అయ్యాయి. అందుకే వెంటనే ఆ డైలాగ్స్‌ని డిలీట్ చేశాం. సినిమాలో కూడా అవి ఉండవు. ప్రస్తుత జనరేషన్లో వాడుతున్న మీమ్స్, ఇతర సినిమాల రిఫరెన్స్‌లు ఎక్కువగా తీసుకున్నాం. ఆ విధంగానే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అల్లు అరవింద్.. ఇలా చాలా మంది డైలాగ్స్ ఉపయోగించాం. ఇవన్నీ ఇంటెన్షన్‌తో చేసినవి కావు. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మా సింగిల్ టీమ్ తరఫున సారీ చెబుతున్నాం. ఇలాంటివి ఇకపై రాకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. మేమంతా ఒకటే. కాకపోతే ఇలాంటివి కొన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. ఏది ఏమైనా మేం సారీ చెబుతున్నాం’ అన్నారు శ్రీవిష్ణు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
