‘హనుమాన్’ టీమ్‌కి తెలంగాణ గవర్నర్ ప్రశంస!
on Apr 27, 2024
2024 సంక్రాంతికి తన మేజిక్‌తో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’ తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శన పూర్తి చేసుకుంది. చిన్న చిత్రం సాధించిన పెద్ద విజయం అని కొన్ని సినిమాల నిర్మాతలు అప్పుడప్పుడు ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ, ‘హనుమాన్’ మాత్రం ఆ క్యాప్షన్‌కి నిజమైన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
తాము ఊహించని విధంగా అంత పెద్ద విజయాన్ని అందుకున్న సందర్భంగా ‘హనుమాన్’ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తెలంగాణ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సాదరంగా ఆహ్వానించిన గవర్నర్ వారితో కాసేపు ముచ్చటించారు. ‘హనుమాన్’ చిత్రానికి సంబంధించిన పలు విశేషాల గురించి అడిగి తెలుసుకున్నారు గవర్నర్. ఈ సినిమా విశేషాలు తెలుసుకున్న గవర్నర్ దర్శకుడు ప్రశాంత్ వర్మను అభినందించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా, ప్రశాంత్‌వర్మ గవర్నర్‌కు హనుమాన్ ప్రతిమను బహూకరించారు.
Also Read