ENGLISH | TELUGU  

ఖరీదైన కారు కొన్న  పుష్ప ఫాదర్..రేటు తెలిస్తే షాక్ అవుతారు

on Apr 27, 2024

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు. ఈ డైలాగ్ ఎవరిదీ అంటే చెప్పని వాళ్ళు ఇండియాలోనే ఉండరు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని కాస్త అటు ఇటుగా మార్చి  పుష్ప ఫాదర్ అల్లు అరవింద్ (allu aravind) చెప్తున్నాడు.  అల్లు అరవింద్ అంటే ఎవరనుకుంటున్నారు. ఇట్స్ ఏ బ్రాండ్ అని. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందో చూద్దాం

అల్లు అరవింద్ ఇటీవలే ఒక కారు కొన్నాడు. ఇందులో ఏముంది.ఇప్పటీకే అరడజను  దాకా కార్లు  ఉండుంటాయని అనుకుంటున్నారు కదు.. కరెక్టే  చాలా  ఉన్నాయి. కాకపోతే లేటెస్ట్ కారు మాత్రం సంథింగ్ స్పెషల్.ఎందుకంటే ఆయన కొన్నది మామూలు కారుని కాదు. బిఎండబ్ల్యు (bmw)కంపెనీకి చెందిన ఐ 7 బ్రాండ్. అధునాతమైన ఫ్యూచర్లతో కూడిన దాని  ధర అక్షరాలా రెండున్నర కోట్లు. షైనింగ్ కలర్ లో మెరుస్తు  సూపర్ గా ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ కూడా  చేస్తున్నాయి.

 అల్లు అరవింద్  గీత ఆర్ట్స్ పై  నిర్మాతగా  ఎన్నో మంచి చిత్రాలని తెరకెక్కించాడు.అందులో ఎక్కువ భాగం  విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచాయి.చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్,నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో సినిమాలని నిర్మించాడు. ప్రస్తుతం  నాగ చైతన్యతోనే  తండేల్ ని నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ బోయపాటి ల అఖండ 2 కి  అరవిందే  నిర్మాత అనే వార్తలు వస్తున్నాయి. గీత ఆర్ట్స్ టూ పై కూడా చిత్రాలని నిర్మిస్తుంటాడు.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.