హన్సిక పెళ్లిపనులు షురూ!
on Nov 23, 2022
'దేశముదురు' తార హన్సికా మొత్వానీ పెళ్లి పనులు మొదలయ్యాయి. సొహేల్ ఖతూరియాతో ఆమె వివాహం మరో రెండు వారాల్లో జరగనుంది. మంగళవారం 'మాతా కి చౌకి' వేడుకతో వారి పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా హన్సిక బ్రైట్ రెడ్ కలర్ శారీతో గార్జియస్గా కనిపించింది. సొహేల్ సైతం ఆమెకు మ్యాచింగ్ అన్నట్లు రెడ్ షేర్వాణీ ధరించాడు. ఆ ఇద్దరూ సంబరంగా నవ్వుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మాతా కి చౌకి వేడుకలో అమితమైన ఆనందంతో కనిపించిన ఆ జంట ఫొటోలకు అందంగా పోజులిచ్చారు. అలాగే హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ వారితో కలిసి దిగిన ఫొటో కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.
డిసెంబర్ 4న హన్సిక, సొహేల్ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్తాన్, జైపూర్లోని ముందోట కోటలో వారి పెళ్లి జరగనుంది. ముందోట కోటకు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడ డిసెంబర్ 2న సూఫి నైట్లో హన్సిక, సోహేల్ పాల్గొంటారు. డిసెంబర్ 3న మెహంది, సంగీత్ వేడుకలు ఉంటాయి. డిసెంబర్ 4న ఉదయం హల్ది వేడుక, సాయంత్రం వివాహ వేడుక ఉంటాయి. తర్వాత క్యాసినో థీంతో పార్టీ జరుగుతుంది.
Also Read