Funky: ఫంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! దీన్ని బట్టి హిట్టా! ప్లాపా!
on Feb 14, 2026

-నిన్న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఫంకీ
-రిపోర్ట్ ఎలా ఉంది
-ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత
-ట్రేడ్ సర్కిల్స్ ఏమంటున్నాయి
తన చిత్రాల్లో ఇక శృతిమించిన బూతులు ఉండవనే మాటకి కట్టుబడి నిన్నమాస్ కా దాస్ 'విశ్వక్ సేన్'(Vishwak Sen)ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఫంకీ'(Funky)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. పంచ్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లో ఒకడిగా ఉన్న అనుదీప్(Anudeep)దర్శకత్వంతో పాటు కయదు లోహర్(Kayadu LOhar)హీరోయిన్ కావడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగానే పోటెత్తారు. ఎంటర్ టైన్ మెంట్ వర్కవుట్ అయ్యిందని ఒక కొత్త విశ్వక్ సేన్ కనిపించాడనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు. మరి తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఐదు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినపడుతుంది. మేకర్స్ అయితే ఇంకా కలెక్షన్స్ గురించి అధికారంగా వెల్లడి చెయ్యలేదు. విశ్వక్ సేన్ గత చిత్రాలకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ తో పోలిస్తే ఫంకీ ఎక్కువే రాబట్టినట్టు. కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ప్రెజెంట్ సినీ మార్కెట్ లో పర్వాలేదనే టాక్ ఉంది.వీకెండ్ తో పాటు మహాశివరాత్రి పర్వదినం కలిసి రావడంతో ఫంకీ కి ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. దీంతో కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.
Also read: కపుల్ ఫ్రెండ్లీ ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది..హైలెట్స్ ఇవేనా!
సితార ఎంటర్ టైన్ మెంట్స్,శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా వరల్డ్‌వైడ్‌గా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర జరిగిందనేది టాక్. మరి థియేటర్స్ లో అందర్నీ నవ్విస్తున్న ఫంకీ తను థియేటర్స్ లో రావడానికి కారణమైన వాళ్ళ ముఖాల్లో కూడా నవ్వులు పూయిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



