ENGLISH | TELUGU  

అలా చెయ్యడానికి మీకు సిగ్గు లేదా.. రివ్యూయర్స్‌పై విరుచుకుపడ్డ టాలీవుడ్ డైరెక్టర్!

on Feb 14, 2026

‘ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే వెంటనే సోషల్ మీడియాలో దాని రివ్యూ పెట్టేస్తున్నారు. నాకు తెలిసి అందులో 90 శాతం మూర్ఖులే ఉంటారు. వారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతికే మీరు, టికెట్ కూడా కొనకుండా ఫ్రీగా సినిమాలు చూసే మీరు.. దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అలా చెయ్యడానికి మీకు మనసెలా వస్తుంది? వారం రోజులు ఆగితే ఆడియన్స్ కూడా సినిమా చూస్తారు. ఈలోగా మీ రివ్యూలతో వారిని ఎందుకు భయపెడుతున్నారు. రివ్యూలు రాసేవాళ్లు సినిమాలు తీసి ఫెయిల్ అయ్యారు, వారికి కనీసం స్క్రీన్‌ప్లే కూడా రాయడం రాదు. సినిమా లేకపోతే మీకు బతుకు లేదు. అదే సినిమాని నాశనం చేస్తూ అన్నం ఎలా తింటున్నారు? మీకు కనీసం సిగ్గు అనిపించడం లేదా?’

ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు రూపొందించే కష్ణవంశీ. ఆయన కెరీర్‌లో చెప్ప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నప్పటికీ చెప్ప్పుకోవడానికి కూడా వీలులేని సినిమాలు కూడా ఆయన తీశారు. 2023లో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ.. మూడేళ్లుగా సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. తనకు సంబంధం లేని వ్యవహారాలలో ఎప్ప్పుడూ తలదూర్చని ఆయన.. తాజాగా సినిమాలపై సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలపై స్పందిస్తూ..  ఆ రివ్యూలు రాసేవారిపై నిప్ప్పులు చెరిగారు. 

సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట పూర్తయిన వెంటనే సినిమాపై నెగెటివ్ ప్రచారం మొదలు పెడుతున్నారని, ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి ఇలాంటి నీచానికి ఒడికట్టడం సరైంది కాదని హెచ్చరించారు. ఒక సినిమా వెనుక చాలా కష్టం ఉంటుందని, దాన్ని అవహేళన చేస్తూ రివ్యూలు రాయడం అంటే వారి శ్రమని తక్కువ  చేసినట్టే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం కష్ణవంశీ చేసిన సినిమాలుగానీ, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలుగానీ ఏమీ లేవు. ఏ సినిమాను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.