Home

»

Latest News

Faria Abdullah: ఆ హీరో కోసమే ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలోకి వచ్చింది.. బయటపడిన పచ్చి నిజం 

Apr 27, 2026

 

చూడండి మిలాడ్ నా క్లయింట్ కి ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి బెయిల్ ఇచ్చేయండనే అమాయకత్వంతో కూడిన లాయర్ గా నవ్వులు పూయించిన నటి ఫరియా అబ్దుల్లా. దీంతో తను కూడా ఒక జాతిరత్నంగా మిగిలిపోయింది. గ్లామర్ రోల్స్ లోను ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ ప్రదరిస్తూ సమ్మర్ లో పుట్టే ఉక్కపోతే నయం కదా అని అభిమానులు భావించేలా చేస్తుంది.ఇప్పుడు ఆ అభిమానులు రీసెంట్ గా చేసిన ఫరియా వ్యాఖ్యల వల్ల తమ బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఆ డీటెయిల్స్ చూద్దాం   

రీసెంట్ గా ఈ టోల్ లెగ్స్ సుందరి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె  మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే ఆయన మీద నాకు భారీ క్రష్ ఉంది. ముఖ్యంగా ఆయన నటించిన మలయాళ చిత్రం 'చార్లీ'  చూసినప్పటి నుండి  వీరాభిమానిని అయిపోయాను. సదరు మూవీలోని  ఆయన క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఒక ఫ్రీ స్పిరిటెడ్ వ్యక్తిగా కనిపిస్తారు. ఆ  క్యారక్టర్ లో ఆయన ఒదిగిపోయిన తీరు ఎంతగానో ప్రభావితం చేసింది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా, దుల్కర్ ఎంచుకునే వైవిధ్యమైన కథలు, ఆయన నటనలో ఉండే ఈజ్ నన్ను ఇన్ స్పైర్ చేస్తాయి. భవిష్యత్తులో ఆయనతో కలిసి కనీసం ఒక్క సీన్ లో అయినా నటించాలని నా కోరిక అని ఫరియా మనసులో ఆశను వెలిబుచ్చింది.

also read: Jyothi Purvaj: ఎంత పని చేసావు.. స్లీపింగ్ టాబ్లెట్స్  మింగినా నిద్రరావడం లేదంట!

మరి ఈ మాటలు చెప్పిన తర్వాత బాధపడని ఫరియా ఫ్యాన్ ఉంటాడా చెప్పండి. ఏం చేస్తాం కలికాలం అని తమకి తాము సర్ది చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతం ఫరియా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలను అందుకుంటోంది. గతేడాది 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో పలకరించిన ఈ భామ, ఇప్పుడు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమవుతోంది. అటు డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతూ ఫరియా అంటే పేరు అనుకుంటున్నారా ఫైర్ అని హింట్ ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com