Home

»

Latest News

Duvvada Madhuri: చీన్ టపాక్ డుం డుం.. నటిగా ఎంట్రీ ఇస్తున్న దువ్వాడ మాధురి!

Apr 27, 2026

సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ దువ్వాడ మాధురి (Duvvada Madhuri) సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. గవిరెడ్డి హీరోగా తెరకెక్కుతున్న "చీన్ టపాక్ డుం డుం" (Cheen Tapak Dum Dum) అనే వెరైటీ టైటిల్ చిత్రంలో ఆమె ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు.

"చీన్ టపాక్ డుం డుం" సినిమాలో దువ్వాడ మాధురి ఒక కీలకమైన, విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్ర పేరు గైరమ్మత్త. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను తాజాగా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో దువ్వాడ మాధురి పాత్ర చుట్టూనే కథలో కీలక మలుపులు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ వాతావరణం, నేటి సోషల్ మీడియా ప్రభావం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.

చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఆగస్టు నెలలో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే పాపులర్ అయిన డైలాగ్ ను టైటిల్‌గా పెట్టడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో పలువురు సీనియర్ నటులు కూడా కనిపిస్తారని సమాచారం. దువ్వాడ మాధురికున్న సోషల్ మీడియా క్రేజ్‌ను ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మార్చుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

విభిన్నమైన టైటిల్ తో వస్తున్న "చీన్ టపాక్ డుం డుం" సినిమా విజయం సాధిస్తే.. నటిగా దువ్వాడ మాధురి బిజీ అయ్యే అవకాశముంది. మరి ఈ సినిమాలో ఆమె తన నటనతో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com