Home

»

Latest News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా.. బోల్డ్ అవతార్‌లో కరెంట్ పుట్టిస్తున్న బ్యూటీ!

Sep 3, 2026 2:00PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటన, పొడవైన పర్సనాలిటీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకున్న భామ ఫరియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' చిత్రంలో 'చిట్టి'గా అమాయకపు నటనతో అలరించిన ఈ హైదరాబాద్ బ్యూటీ, కేవలం నటనకే పరిమితం కాకుండా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఈ పొడుగుపాటి సుందరి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఒక గ్లామరస్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెల్లటి బికినీ తరహా డ్రెస్‌లో ఫరియా ఇచ్చిన కిల్లర్ పోజులు, హాట్ ఎక్స్‌ప్రెషన్లు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎప్పుడూ ట్రెడిషనల్ అండ్ బబ్లీ లుక్స్‌తో కనిపించే చిట్టిలో ఇంతటి హాట్ అండ్ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ లేటెస్ట్ విజువల్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. "ఫరియాలో స్టార్ హీరోయిన్‌కు కావలసిన అన్ని గ్లామర్ క్వాలిటీస్ ఉన్నాయని, టాలీవుడ్ దర్శకులు ఆమెలోని ఈ హాట్ యాంగిల్‌ను కూడా గమనించి పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని" కోరుతున్నారు. మరికొందరు అభిమానులైతే ఏకంగా హాలీవుడ్ రేంజ్ కటౌట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నటిగా మాత్రమే కాకుండా ఫరియా అబ్దుల్లాలో చాలా కోణాలు ఉన్నాయి. 'బంగార్రాజు'లో స్పెషల్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ భామ.. డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, గేయ రచయితగా, గాయకురాలిగా కూడా తన సత్తా చాటుకున్నారు. ఇటీవల వచ్చిన 'మత్తు వదలరా 2' చిత్రంలో నటిస్తూనే పాటలు పాడి, లిరిక్స్ అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం ఫరియా కెరీర్ విషయానికి వస్తే, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ 'సిగ్మా'తో పాటు విజయ్ ఆంటోనీతో కలిసి ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సత్యదేవ్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్, తిరువీర్ సరసన 'భగవంతుడు' అనే చిత్రంలోనూ నటిస్తూ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.

సినిమాలతో నిరంతరం బిజీగా ఉంటూనే, ఇలాంటి గ్లామరస్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫరియా రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా రీచ్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కొత్త గ్లామర్ లుక్ ఆమె కెరీర్‌కి మరిన్ని పెద్ద అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి.

 

 

 

[Faria Abdullah Glamorous Photos, Jathi Ratnalu Chitti Faria Abdullah, Faria Abdullah Latest Video Viral, Tollywood Heroine Faria Glam Look, TeluguOne Entertainment News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com