Home

»

Latest News

బిగ్ షాక్: 'బెత్లెహెం కుటుంబ యూనిట్' తెలుగు రిలీజ్‌లో ట్విస్ట్.!

Sep 3, 2026 2:19PM

మలయాళంలో సంచలన విజయం సాధించిన నివిన్ పౌలీ, మమితా బైజు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెం కుటుంబ యూనిట్' తెలుగు రిలీజ్ విషయంలో ఊహించని షాక్ తాగింది. 

ప్రేమలు లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గిరీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. మలయాళంలో ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. విపరీతమైన క్రేజ్ ఉండటంతో తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

PVR, INOX, మిరజ్ లాంటి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ చైన్స్ అన్నీ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను తమ థియేటర్లలో ప్రదర్శించడానికి నిరాకరించాయి. మల్టీప్లెక్స్ చైన్స్ స్క్రీన్స్ కేటాయించకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా కేవలం లోకల్ మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ కాబోతోంది.

సాధారణంగా మల్టీప్లెక్స్ చైన్స్ రూల్స్ ప్రకారం ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల పాటు OTT లోకి రాకూడదు. కానీ బెత్లెహెం కుటుంబ యూనిట్ ఇప్పటికే ఆగస్టులోనే మలయాళంలో థియేట్రికల్ రిలీజ్ అయింది. దాంతో డిజిటల్ స్ట్రీమింగ్ గ్యాప్ చాలా తక్కువగా ఉండబోతోంది. అతి త్వరలోనే ఈ మూవీ OTT లోకి రానుండటంతో, మల్టీప్లెక్స్ చైన్స్ తమ నిబంధనలకు విరుద్ధంగా స్క్రీన్లు ఇవ్వలేమని స్పష్టం చేశాయి.

మరి ఈ వివాదం నడుమ ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లోనే విడుదలవుతున్న ఈ మలయాళ డబ్బింగ్ ఎంటర్‌టైనర్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

 

 

[Bethlehem Kudumba Unit, Telugu Release, Nivin Pauly, Mamitha Baiju, Premalu Director, Girish AD, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com