
తెలుగు చలన చిత్ర సీమలో వెంకటేష్(Venkatesh)నటనకి ఉన్న స్టామినా గురించి ఎవరైనా చెప్పడం స్టార్ట్ చేస్తే.. కొత్త నిజాన్ని కనిపెట్టవా ఏంటని మన ముఖాన్ని విచిత్రంగా చూసే పరిస్థితి. ఎందుకంటే ఆ లెజండ్రీ సృష్టించిన, సృష్టిస్తున్న ప్రభంజనం గురించి అందరకి తెలిసిందే. కానీ మోహన్ లాల్ కంటే నేను బాగా చేయలేనని వెంకటేష్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
మోహన్ లాల్(Mohan Lal)దృశ్యం(Drushyam)మూవీని వెంకటేష్ కూడా అదే పేరుతో తెలుగులో చేసిన విషయం తెలిసిందే. రెండు చోట్ల వెంకటేష్ చిన్న కూతురు 'అను' గా 'ఎస్తేర్ అనిల్' చేసింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మోహన్ లాల్ గారు ఇచ్చిన కొన్ని ఎక్స్ ప్రెషన్ ని నేను ఇవ్వలేను. అది కేవలం ఆయనకి మాత్రమే సాధ్యమని అన్నారని చెప్పుకొచ్చింది. వెంకటేష్ కూడా దృశ్యం విషయంపై మాట్లాడుతు మోహన్ లాల్ వంటి లెజెండరీ నటుడు చేసిన క్యారక్టర్ ని తిరిగి చేయడం అనేది ఏ నటుడికైనా కత్తి మీద సామే. మోహన్ లాల్ గారు జార్జి కుట్టిగా అద్భుతంగా నటించారు.
Also read: Swagatha Krishnan: ఆ మ్యూజిక్ డైరెక్టర్ నాపై లైంగిక దాడి చేసాడు.. ప్రముఖ సింగర్ సంచలన కామెంట్స్
ఆయన నటనని కాపీ కొట్టడం నా ఉద్దేశ్యం కాదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, ఆ తండ్రి పడే ఆవేదనను నాదైన రీతిలో చూపించడానికి ప్రయత్నించాను. అసలు దృశ్యం వంటి బలమైన కథ ఉన్నప్పుడు, నటుడిగా పని సులభం అవుతుంది. ఆ కథలోనే ఒక మ్యాజిక్ ఉందని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మోహన్ లాల్ దృశ్యం 3 చేస్తున్నారు. వెంకటేష్ మాత్రం తెలుగులో రీమేక్ చెయ్యడం లేదు.





