Home

»

Latest News

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

Apr 29, 2026

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ రఘురామ్ (52) కన్నుమూశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, మంగళవారం సాయంత్రం సమయంలో ఆయన వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. గత కొన్నాళ్లుగా ఆయన శ్వాసకోస సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. (Director Raghu Ram)

రఘురామ్ స్వస్థలం జగిత్యాల జిల్లా. జర్నలిజంపై మక్కువతో పలు ప్రముఖ వార్తా సంస్థల్లో పని చేశారు. అయితే, సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన వెండితెర వైపు అడుగులు వేశారు. ప్రముఖ దర్శకుడు సానా యాదిరెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి మెళకువలు నేర్చుకున్నారు.

2004లో విడుదలైన 'వరం' సినిమాతో రఘురామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, దర్శకుడిగా ఆయన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలకు రచయితగా పని చేశారు.

రఘురామ్ కు భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని మధురా నగర్‌లో నివసిస్తోంది.

రఘురామ్ మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి దర్శకుడిని, అంతకంటే గొప్ప జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com