Home

»

Latest News

‘ది ఒడిస్సీ’ రికార్డులను విడుదలకు ముందే బ్రేక్ చేసిన మూవీ ఇదే.!

Oct 22, 2026 5:06PM

హాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ‘ది ఓడిస్సీ’ సినిమాపై ఉన్న అంచనాలను మించి, అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. లండన్‌లోని ప్రముఖ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో కేవలం 24 గంటల్లోనే 33 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ టికెట్ల విక్రయాల ద్వారా 8.8 లక్షల పౌండ్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి.

ఇప్పటివరకు ఈ థియేటర్‌లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు ‘ది ఓడిస్సీ’ పేరిట ఉండేది. ఆ సినిమా 24 గంటల్లో సుమారు 7.5 లక్షల పౌండ్ల విలువైన టికెట్లను విక్రయించింది. ఇప్పుడు ‘డ్యూన్: పార్ట్ త్రీ’ ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ లెక్కలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన బుకింగ్స్‌కు సంబంధించినవి కావు.. ఒక్క బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో నమోదైన అడ్వాన్స్ టికెట్ విక్రయాలు మాత్రమే.

డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్యూన్: పార్ట్ త్రీ’లో తిమోతీ షాలమే మరోసారి పాల్ అట్రైడీస్ పాత్రలో కనిపించనున్నారు. జెండయా, ఫ్లోరెన్స్ పగ్, జాసన్ మోమోవా, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మునుపటి చిత్రాల కథకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, పాల్ అట్రైడీస్ పాలనలో ఎదురయ్యే పరిణామాలు, కొత్త శత్రువులు, ద్రోహాల చుట్టూ సాగనుంది.

ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 15 నుంచి బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18, 2026న సినిమా విడుదల కానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ‘డ్యూన్: పార్ట్ త్రీ’ చూపిస్తున్న ప్రభావం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 

 

[Dune Part Three, Dune Part Three Advance Bookings, The Odyssey Movie, Dune 3 IMAX Record, Denis Villeneuve, Dune Part Three Release Date, BFI IMAX Ticket Sales]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com