Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ 2 కి మోదీ నోట్ల రద్దుకి సంబంధం ఉందా!

Mar 20, 2026

 

-సెల్యులాయిడ్ పై ధురంధర్ 2 సందడి 
-పాజిటివ్ టాక్ 
-నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది

2016 నవంబర్ 9 న మన దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ'(Narendra Modi)నోట్ల రద్దు అనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఊహించని ఆ నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవ్వడంతో పాటు నగదు లావాదేవాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. చాలా మంది మీడియా సముఖంగా మాట్లాడుతు 'హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ముందుగానే చెప్పి ప్రిపేర్ చేసుండొచ్చు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కానీ  కారణాలని మాత్రం కేంద్ర ప్రభుత్వాలు వెల్లడి చేయలేదు. దీంతో రచయితగా  టాలెంట్ లేకపోయినా ఉందనే షో చేస్తు కేంద్ర ప్రభుత్వ విధానాలపై రకరకాల కథనాలని చాలా మంది ఊహించుకుంటూ వచ్చారు. కానీ రీసెంట్ గా విడుదలైన ధురంధర్ 2(Dhurandhar 2)లో నోట్ల రద్దు అంశంపై చెప్పిన తీరు ప్రతి ఒక్కర్ని ఆలోచింపచేస్తుంది. వాటి వివరేలేంటో చూద్దాం.

ధురంధర్ 2 లో ముంబై అండర్ వరల్డ్ డాన్, ముంబై బాంబు పేలుళ్ల సూత్రదారి 'దావుద్ ఇబ్రహీం' ఒక కీలకమైన క్యారక్టర్ లో కనిపిస్తాడు. పాకిస్థాన్ లోనే ఉంటు ఇండియాని దెబ్బ కొట్టాలని చూసే దావుద్ విషప్రయోగం వల్ల అందవికారంగా మారి మంచంపైనే పడి  ఉంటాడు. తన దగ్గర ఉన్న అరవై వేల కోట్ల రూపాయిల ఇండియన్ కరెన్సీ తో ఇండియాలోని అన్ని ప్రాంతాలలోని యువతకి  డ్రగ్స్ అలవాటు చెయ్యడంతో పాటు ఆ డబ్బుతో ఆయుధాల్ని అందచెయ్యాలనేది దావుద్ ప్లాన్ . ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి.  ఈ విషయం హంజా(ధురంధర్) కి తెలియడంతో ఇండియన్ ఇన్విస్టిగేషన్ బ్యూరో హెడ్ 'అజయ్ సన్యాల్' కి చెప్తాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ నోట్ల రద్దుని ప్రకటించడాన్ని పార్ట్ 2 లో చూపించారు.దీంతో సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ లో ఈ అంశంపై భారీ స్థాయిలోనే చర్చ జరుగుతుంది.

Also read: Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీ ఇదే.. సాహూ లాంటి ఆఫర్ అవుతుందా! 

ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 1 లు మన దేశానికి, పాకిస్థాన్ కి మధ్య జరిగిన కొన్ని నిజ సంఘటనలని బేస్ చేసుకొని తెరకెక్కించారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ వద్ద ధురంధర్ 2 పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండంతో ధురంధర్ అభిమానులతో థియేటర్స్ కలకలలా డుతున్నాయి.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com