
శ్రీవిష్ణు అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ఓ వైపు విభిన్న సినిమాలు చేస్తూనే, మరోవైపు ప్రేక్షకులు తన నుంచి ఆశించే ఎంటర్‌టైనర్స్ తో అలరిస్తుంటాడు. ఇటీవల 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) సినిమాతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. బాగానే నవ్వులు పూయించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.
'విష్ణు విన్యాసం' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈరోజు(మార్చి 20) నుంచి 'విష్ణు విన్యాసం' స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది.
థియేటర్లలో బాగానే నవ్వించినప్పటికీ 'సామజవరగమన', 'సింగిల్' సినిమాల స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది 'విష్ణు విన్యాసం'. రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు మార్కు కామెడీకి ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. అందుకే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఎదురుచూశారు. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వడంతో అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకునే అవకాశముంది.
.webp)
డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన 'ఆయ్' ఫేమ్ నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఒంగోలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో శ్రీవిష్ణు ఒక జూనియర్ లెక్చరర్‌గా కనిపించాడు. ముఖ్యంగా న్యూమరాలజీని పిచ్చిగా నమ్మే హీరో, చిత్ర విచిత్రంగా ప్రవర్తించే హీరోయిన్ మధ్య జరిగే కామెడీ డ్రామా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది.
కాగా, 'విష్ణు విన్యాసం' విడుదలైన వారానికే మార్చి 6న 'మృత్యుంజయ్'(Mrithyunjay) సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు శ్రీవిష్ణు. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది.
Also Read: బిగ్ షాక్.. పెద్ది మళ్ళీ వాయిదా.. అసలేం జరుగుతోంది?






