Home

»

Latest News

Dhurandhar 2 Review In Telugu: ధురంధర్ 2 సినిమా రివ్యూ

Mar 18, 2026

 

సినిమా పేరు: ధురంధర్ 2 
న‌టీన‌టులు: రణవీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్,  అర్జున్ రామ్ పాల్, మాధవన్, రాకేష్ బేడీ, మనవ్ గోహ్లి, గౌరవ్ గెరా తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: వికష్ నౌలఖా 
ఎడిటింగ్: శివ్ కుమార్
మ్యూజిక్: సాస్వత్ సచ్ దేవ్  
నిర్మాత‌: ఆదిత్య దర్, లోకేష్ దర్, జ్యోతి దేశ్ పాండే
బ్యానర్స్: జియో స్టూడియోస్, b 62 స్టూడియోస్  
రచన,దర్శకత్వం: ఆదిత్య ధర్ 
రిలీజ్ డేట్ : మార్చి 19 2026 

ఇండియన్ సినీ ప్రేమికులతో పోటీపడుతు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో  ఎదురుచూస్తున్న ధురంధర్ 2 (Dhurandhar 2) సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యింది.  ప్రీమియర్స్ నుంచే వాళ్ళ కల నెరవేరడంతో థియేటర్స్ మొత్తం ధురంధర్ అభిమానులతో కిటకిటలాడాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
రెహ్మాత్ డెకాయత్(అక్షయ్ ఖన్నా) చనిపోయిన తర్వాత ల్యారీ ఏరియాకి ఉజైర్ (దనిష్ పండోర్) ని లీడర్ గా చేస్తాడు హంజా అలీ మజారి ఉరఫ్ జస్కిరాత్. ( రణవీర్ సింగ్). కానీ ఉజైర్ ని దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలు పాలవుతాడు. హంజా మావయ్య ప్రముఖ రాజకీయనాయకుడు జమీల్ జమాల్ (రాకేష్ బేడీ) పిఏపి పార్టీ నుంచి మరో పార్టీలో జాయిన్ అవుతాడు. హంజానే జాయిన్ చేస్తాడు. దీంతో హంజా పాకిస్థాన్ లో బలమైన శక్తిగా తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటాడు. మేజర్ ఇక్బల్(అర్జున్ రాంపాల్) యువకుల్ని తీవ్రవాదులుగా చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాడు. హంజాని ఇండియాలో పుట్టి పాకిస్థాన్ లో ఉంటూ ఇండియాని నాశనం చెయ్యాలని చూసే దావుద్ ఇబ్రహీం దగ్గరకి తీసుకెళ్తాడు. పోలీస్ ఆఫీసర్ ఎస్ పి అస్లాం చౌదరి( సంజయ్ దత్) కి హంజాపై డౌట్ వస్తుంది. హంజా భార్య ఎలినా(సారా అర్జున్) కి అయితే హంజా ఇండియన్ అని తెలుస్తుంది. దాంతో హంజాని ఒక కోరిక కోరుతుంది. ఎలినా కోరిన కోరిక ఏంటి? హంజా బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత అతనికి ఏర్పడిన శత్రువులు ఎవరు?  పాకిస్థాన్ లో ఏ లక్ష్యంతో ఉంటున్నాడో, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాడు? తద్వారా ఇండియాకి ఎలాంటి మంచి జరిగింది? ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అజయ్ సన్యాల్(మాధవన్) క్యారక్టర్ ఏంటి? హంజాగా ఉన్న జస్కి రాత్ గతం ఏంటి? చివరకి అతను సంతోషకరమైన జీవితంలో ఉన్నాడా? లేక విషాదకరమా? అనేదే ధురంధర్ 2 

ఎనాలసిస్ 

పార్ట్ 1 అయితే సూపర్ గా ఉంది కదా పార్ట్ 2 లో ఏముంటుందిలే అని చాలా మంది అనుకోని ఉంటారు. కానీ మొదటి భాగం కంటే రెండవ భాగం ఇంకా బాగుంది. మన దేశంలో జరిగిన  రియల్ ఇన్సిడెన్స్ కి లింక్ పెడుతూ కథనం వచ్చే సరికి ఆశ్చర్యపోతాం. ఇదా అసలు నిజమని తెలిసాక ఎన్నో డౌట్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ ప్రారంభం నుంచే పిన్ డ్రాప్ సైలెన్స్ తో కథలోకి లీనమైపోతాం. పంజాబ్ స్టేట్ లోని పఠాన్ కోట్ ఎంఎల్ఏ ఇంట్లోకి జస్కిరాత్ వెళ్లి సృషించే మారణహోమంతో పార్ట్ 2 ఎంత సైలెంట్ ని మెయింటైన్ చేస్తుందో, అంతే వైలెంట్ కూడా ఇస్తుందని చెప్పినట్లయింది. ఈ సందర్భంగా వచ్చిన ఫ్లాష్ బ్యాక్ హృదయాల్ని కట్టిపడేస్తుంది.

అదే టెంపోతోనే తర్వాతి సీన్స్ వచ్చాయి. వచ్చే ప్రతి సీన్ లో కూడా హంజా గతం ఎలా బయటపడుతుందనే టెన్షన్ మైంటైన్ అవుతూనే వచ్చింది. ఎస్పి అస్లాం చౌదరితో వచ్చే సీన్స్, ఉజైర్ ని ఇరికించే సీన్స్, బలోచి సీన్స్, జస్కి రాత్ బెస్ట్ ఫ్రెండ్ సొంత దేశం ఇండియానే దెబ్బ కొట్టడానికి పంజాబ్ నుంచి పాకిస్థాన్ రావడం, అతన్ని హంజాగా ఉన్న జస్కి రాత్ చంపడం ఇలా  చెప్పుకుంటూ పోతే అన్ని సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. సెకండ్ హాఫ్ లో హంజా విధ్వంసం స్టార్ట్ కావడంతో పాటు ప్రతి నిమిషం ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ సీన్ టూ సీన్ పెరిగింది. ఎలినాకి హంజా గురించి అసలు నిజం తెలిసాక కథనం జెట్ స్పీడ్ వేగంతో కదిలింది. దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్ తో పాటు అస్లాం చౌదరి. మేజర్ ఇక్బల్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  అతి పెద్ద ఎసెట్.

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు 
హంజా అలీ మజారి, జస్కి రాత్ సింగ్ గా రణవీర్ సింగ్(Ranveer  singh) పెర్ఫార్మ్ రేంజ్ ని చెప్పుకోవాలంటే మాటలు చాలవు. పార్ట్ 1 ని  మించి తన నట ప్రస్థానం కొనసాగింది. బహుశా తన ఎంటైర్ కెరీర్ లో మళ్ళీ ఇలాంటి క్యారక్టర్ రణవీర్ కి రాదేమో. ముఖ్యంగా జస్కి రాత్ సింగ్ గా చేసిన సెటిల్డ్ పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో  కన్నీళ్లు తెప్పించాడు. సారా అర్జున్ కూడా పార్ట్ 1 లో నా పెర్ఫార్మ్ చూసింది మీరు తక్కువ ఇది నా పెర్ఫార్మ్ అనే రీతిలో నాచురల్ పెర్ఫార్మ్ తో మెప్పించింది. సంజయ్ దత్ కూడా అంతే. ఎస్ పి చౌదరి అస్లాంగా తగ్గేదెలే అనే విధంగా మెస్మరైజ్ చేసాడు. మేజర్ ఇక్బల్ గా అర్జున్ రామ్ పాల్, ఐబి చీఫ్ అజయ్ సన్యాల్ గా మాధవన్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో కూడా ప్రదర్శించిన అద్భుతమైన పెర్ఫార్మ్ కి హాట్స్ హాఫ్ చెప్పవచ్చు. మిగతా ఆర్టిస్ట్స్ కూడా తమ క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా మెస్మరైజ్ చేసారు. దర్శకుడిగా, రచయితగా ఆదిత్య ధర్(Aditya Dhar)ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. క్యారెక్టర్స్ ని ఉపయోగించుకున్న తీరుగాని, పకడ్బందీ స్క్రీన్ ప్లే విషయంలో గాని తన ఇంటెలిజెన్స్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. కథకి లొకేషన్స్ ప్రధాన ప్లస్ కాబట్టి అందుకు తగ్గ కథనాన్నే సృష్టించుకున్నాడు. భారీ డ్యూరేషన్ అనే విషయాన్నీ తెలియనీయకుండా కూడా ఆదిత్య ధర్ టేకింగ్ సాగింది.  డైలాగ్స్ క్యారెక్టర్స్ రేంజ్ కి తగ్గట్టుగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలానే  ఉన్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్ 1 కి ఎలా అయితే హెల్ప్ అయ్యాయో, ధురంధర్ 2 కి అంతే హెల్ప్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. నిర్మాణ విలువలు కూడా ఒక  రేంజ్ లో ఉన్నాయి.

 

 ప్లస్ పాయింట్స్ 
1 . కథ
2 . కథనం నడిచిన విధానం 
3 . రణవీర్ సింగ్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్ 
4 . ఆదిత్య దర్ డైరెక్షన్ 
5 .యాక్షన్ సీక్వెన్స్ 
6 . ప్రీ క్లైమాక్స్ 
7 . క్లైమాక్స్ 
8 .ఫొటోగ్రఫీ తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్ 
9 . ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చూపించడం 
10 .దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్ 

బలహీనతలు 
1 . హంజా గురించి అసలు నిజాన్ని సిల్లీగా చూపించడం

ఫైనల్ గా చెప్పాలంటే పార్ట్ 1 ని మించి మెప్పించే విధంగా పార్ట్ 2 ఉంది. రణవీర్, ఆదిత్య ధర్ తో పాటు 24 క్రాఫ్ట్స్ సినిమా విజయానికి ప్రాణంగా నిలిచాయి.

రేటింగ్ 3 .25 /5 

                                                                                                          అరుణాచలం 
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com