నిజమైనే స్టార్ హీరో అతనే: అమీర్
on Jan 3, 2014
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఒకడు అని అంటే అందరు నిజమే అని అంటారు. కానీ తాను మాత్రం మాములు నటుడిని అని అంటున్నాడు అమీర్ ఖాన్. "ధూమ్ 3" విడుదలై భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్ర విజయం సందర్భంగా ముంబాయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమీర్ మాట్లాడుతూ... "సెలవు దినమైన ఆదివారం రోజున పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినిమా హాళ్ళకు తరలివస్తారు. అది ఏ సినిమాకైనా జరిగేదే. కానీ ప్రతిరోజూ ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించాలంటే అది గొప్ప స్టార్ కి మాత్రమే దక్కుతుంది. నేను ఖచ్చితంగా అలాంటి స్టార్ ని కాదు. నేను సాధారణ నటుడిని మాత్రమే. చెత్త సినిమాకి కూడా ప్రేక్షకుల్ని రప్పించే సత్తా ఉన్నవాడే స్టార్ హీరో. అలాంటి స్టార్ హీరో బాలీవుడ్ లో సల్మాన్ ఒక్కడే. సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించే సామర్థ్యం సల్మాన్ కి మాత్రమే ఉంది" అని అంటూ సల్మాన్ ని పొగడ్తలతో ముంచెత్తాడు అమీర్. మరి అమీర్ ఈ విధంగా మాట్లాడటం నిజంగా మంచి విషయమే అని చెప్పుకోవచ్చు.