Home

»

Latest News

‘నేనొకరిని ప్రేమిస్తున్నా’.. పెళ్లిచూపుల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అనుపమ.!

Oct 12, 2026 11:54AM

టాలీవుడ్‌లో పెళ్లి నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘క్రేజీ కల్యాణం’. అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్ భాస్కర్‌, అఖిల్ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ బంధాలు, పెళ్లి సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, సరదా గొడవలతో సాగిన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బోల్డ్ డైలాగ్స్‌, సహజమైన కామెడీతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌ బాలరాజు అనే పాత్రలో కనిపిస్తున్నారు. నరేశ్‌ పెద్దల్లుడిగా ఇంట్లో ఎలాంటి పని చేయకుండా తిరుగుతూ, రాత్రివేళ తాగి వచ్చి హడావుడి చేసే వ్యక్తిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. చిన్న కూతురికి మంచి సంబంధం తీసుకొచ్చి ఊళ్లో తన పరువు నిలబెట్టుకోవాలని నరేశ్‌ భావిస్తారు. అయితే, ఆయన ఆశలకు భిన్నంగా చిన్న కూతురు కీర్తి తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుండటంతో కథలో అసలు గందరగోళం మొదలవుతుంది.

కాలేజీలో తనతో చదువుకున్న అఖిల్ రాజ్‌ను అనుపమ ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి అమెరికా సంబంధాన్ని తీసుకురావడంతో పెళ్లి విషయంలో సమస్యలు మొదలవుతాయి. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను మరొకరిని ప్రేమిస్తున్నానని అనుపమ చెప్పే సన్నివేశం ట్రైలర్‌లో కీలకంగా నిలిచింది. దీనికి తోడు పెళ్లికొడుకు అడిగే బోల్డ్ ప్రశ్నతో కామెడీ మరో స్థాయికి చేరుతుంది. అనుపమ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్‌, తరుణ్ భాస్కర్‌ కామెడీ టైమింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి.

బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రేమ, పెళ్లి, కుటుంబ సంబంధాలను వినోదాత్మకంగా చూపిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 16, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌లో కనిపించిన హాస్యం, కుటుంబ గందరగోళం వెండితెరపై ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తాయో చూడాలి.

 

 

[Crazy Kalyanam Trailer, Anupama Parameswaran, Tharun Bhascker, Crazy Kalyanam Movie, Akhil Raj, Badrappa Gajula, Crazy Kalyanam Release Date, Telugu Movie Trailer, Crazy Kalyanam Cast, Telugu Family Comedy Movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com