
కొంత కాలంగా హిట్ నే కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మార్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' తో రాబోతున్నాడు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కగా కొంత సేపటి టీజర్ విడుదలైంది. అలా రిలీజ్ అయ్యిందో లేదో టీజర్ ని చూస్తూ ఉండటం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల ఫ్యాషన్ అయిపోయింది. దీంతో ఆటో మాటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. టీజర్ చూస్తుంటే ఈ సారి కూడా ఎప్పటిలాగానే వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు,వస్తున్నట్లు అర్ధం అవుతుంది.
1992వ సంవత్సరం నాటి కాలఘట్టంలో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా మాడుగుల అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. సరిగ్గా రేడియోలో నక్సలైట్ ముప్పు పెరుగుతోందని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఒక అనౌన్స్‌మెంట్ రావడంతో టీజర్ ఎంతో ఉత్కంఠభరితంగా ప్రారంభమవుతుంది. అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్ లీడర్ 'కామ్రేడ్ కళ్యాణ్'ను ఎలాగైనా వేటాడి పట్టుకోవాలని గ్రేహౌండ్స్ బలగాలు మరియు ప్రత్యేక పోలీస్ బృందాలు ఆ గ్రామాన్ని చుట్టుముడతాయి. అక్కడ మొదలైన తీవ్రమైన వేట, ఊహించని మలుపులు, రోమాంచితమైన సీన్లు ప్రేక్షకులను క్షణం కూడా పక్కకు తప్పుకోకుండా టీజర్‌కు కట్టిపడేస్తాయి. అయితే, ఈ క్రైమ్ అండ్ మ్యాన్‌హంట్ నేపథ్యానికి దర్శకుడు ఎంతో తెలివిగా కామెడీని జతచేశాడు. సీరియస్ పోరాటాలు, రాజకీయ ఉద్రిక్తతల నడుమ శ్రీ విష్ణు మార్క్ వినోదం, ఆయన టైమింగ్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తున్నట్లు అందుతున్న సంకేతాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. తెలంగాణ మరియు ఆంధ్ర యాసలతో పలికించిన సంభాషణలు, డిఫరెంట్ లుక్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రతి సన్నివేశంలోనూ హైలైట్‌గా నిలిచాయి. శ్రీ విష్ణు కామెడీ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమనిపిస్తోంది.

Also read: హనుమాన్ అంశ చిత్రానికి పన్ను మినహాయింపు: మన ముఖ్యమంత్రిపై ప్రశంసలు
సాంకేతిక పరంగా కూడా ఈ టీజర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. 1990ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా కనిపిస్తోంది. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని యాక్షన్, వినోదాన్ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ టీజర్‌కు మంచి రేసింగ్ పేస్‌ను తెచ్చిపెట్టింది. అలాగే సినిమాలో రాధికా శరత్ కుమార్, అపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
మొత్తంగా చూస్తే, 'కామ్రేడ్ కళ్యాణ్' టీజర్ వింటేజ్ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పక్కా యాక్షన్-కామెడీ రైడ్‌ను ప్రామిస్ చేస్తోంది. స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాత.అక్టోబర్ 9 వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్
.
[Comrade Kalyan Teaser, Sree Vishnu, Kona venkat, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






