Home

»

Latest News

చైనాలో మార్మోగిన ప్రభాస్ పాట: కూచిపూడి డ్యాన్స్‌తో చైనీస్ పిల్ల షాకింగ్ పెర్ఫార్మన్స్.!

Sep 8, 2026 3:41PM

రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ 'పౌర్ణమి' గుర్తుండే ఉంటుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించకపోయినా, అందులోని పాటలు మాత్రం మన మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన, సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించిన, కె.ఎస్. చిత్ర మంత్రముగ్ధమైన గొంతులో వచ్చిన 'భరత వేదముగా..' పాట అంటే ఇప్పటికీ ప్రతీ ఒక్కరికీ ప్రాణమే.

అయితే, సరిగ్గా 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ వింటేజ్ క్లాసికల్ సాంగ్.. ఇప్పుడు ఏకంగా చైనాలో మార్మోగిపోతోంది. చైనాకు చెందిన మీరా వాంగ్ అనే ఒక యువతి ఈ 'భరత వేదముగా' పాటకు చేసిన అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రస్తుతం ఇంటర్నెట్ లో గ్లోబల్ వైడ్ గా వైరల్ అవుతోంది. ఆమె ముఖంలో కనిపించే భావాలు, అచ్చం మన భారతీయురాలిలా ఆమె పలికిస్తున్న అభినయం, కనురెప్పల కదలికలు చూస్తుంటే నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

మీరా వాంగ్ ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా భారతదేశంలో కాలు పెట్టలేదు. మన దేశానికి రాకుండానే, ఆంధ్రాలోని అనంతపురానికి చెందిన కూచిపూడి గురువు అలా వేణుగోపాల్ దగ్గర ఆన్‌లైన్ ద్వారా కూచిపూడి నేర్చుకుంటోంది. భారతీయ సంస్కృతిపై, తెలుగు సినిమా సంగీతంపై ఉన్న విపరీతమైన ప్రేమతో ఆమె అహోరాత్రులు సాధన చేసి ఈ ప్రదర్శన ఇచ్చింది.

మీరా వాంగ్ కు తెలుగు భాషపై ఎంతటి అభిమానం ఉందంటే.. గతంలో 'మాయాబజార్' సినిమాలోని ఆల్ టైమ్ క్లాసిక్ 'అహా నా పెళ్లంట..' పాటకు కూడా నాట్యం చేసి నెటిజన్ల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ 'భరత వేదముగా' పర్ఫార్మన్స్ తో టాలీవుడ్ స్టార్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ చైనీస్ భామపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

 

 

[Chinese Dancer Meera Wang, Kuchipudi Dance, Prabhas Pournami Song, Bharata Vedamuga Song, Devi Sri Prasad, Sirivennela Songs, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com