Home

»

Latest News

చిరు డాటర్ సుస్మితకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు   

Sep 8, 2026 3:48PM

 

 

మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటుంది.  మన శంకర వరప్రసాద్ గారుతో ఇప్పటి వరకు వచ్చిన చిరంజీవి  ఎంటైర్ కెరీర్ సినిమాల మొత్తంలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిపింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తో తెరకెక్కించిన 'జగమే సంగీతం'తో కూడా హిట్ అందుకుంది.


రీసెంట్ గా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్మితకి  కీలకమైన బాధ్యతలని అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం) ట్రస్ట్ బోర్డుకి సుస్మిత ని ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి చిరంజీవి నుంచి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంతో  కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదగడం, ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించబడం విశిష్టమనే చెప్పాలి. సుస్మిత తల్లి చిరు వైఫ్ తెలంగాణలోని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డ్ నెంబర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

Also Read: ఈ రోజు అనస్వర రాజన్ బర్త్ డే:  కాకా కూతురి లుక్ రిలీజ్.. మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్

 

 

 

[Sushmitha Konidela, Durga Devi Temple. Chiranjeevi, Ap Cm, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com