Home

»

Latest News

ప్రముఖ హీరోయిన్ కి అత్యాచార బెదిరింపులు.. ధురంధర్ గుర్తుంది కదా!  

Mar 05, 2026


-సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది!
-ఎందుకు ఆ హీరోయిన్ ని టార్గెట్ చేసారు 
-బెదిరింపులపై తను ఏం చెప్తుంది 

ధురంధర్(Dhurandhar)..భారతీయ సినిమా రంగం గొప్పతనాన్నిప్రస్తావించుకునే ప్రతిసారి ధురంధర్ గురించి చెప్పకోవాల్సిందే. దీన్ని బట్టి సదరు చిత్రాల్లోని నటులు ఎంత అదృష్టవంతులో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వారి సరసన చేరిన నటి 'అయేషా ఖాన్'(Ayesha khan). ధురంధర్ లోని  'షరారత్ సాంగ్' లో డాన్సర్ గా కనిపించి మెప్పించింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియా వేదికగా వస్తున్న మెసేజెస్ చూస్తుంటే మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అని కొంచం భయబ్రాంతులకి లోనవుతాం. పూర్తి విషయం చూద్దాం.
 

అయేషా ఖాన్ ఇన్ స్టాగ్రామ్(Instagram)లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ఆమెకి ఇన్  స్టాగ్రామ్ వేదికగా మెసేజెస్ వస్తున్నాయి. సదరు మెసేజెస్ లో ఆమెని అత్యాచారం చేస్తామంటూ కొంత మంది బెదిరిస్తున్నారు. డైలీ అలాంటి మెసేజెస్ లే చేస్తుండటంతో పాటు   అత్యంత జుగుప్స కలిగించే విధంగా కూడా తమ వికృత రూపాన్ని బయటపెడుతున్నారు. 
స్వయంగా  ఆయేషా ఖాన్ నే  ఈ విషయాన్ని వెల్లడి చేసింది. సోషల్ మీడియాలో నేను ఏ ఫోటో షేర్ చేసినా దాని కింద చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. పట్టించుకోకుండా ఉందామనుకుంటే నా వ్యక్తిగత భద్రతకి సంబంధించిన విషయం. కాబట్టి వారి పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చింది.

also read: Pushpa 2 vs ustaad baghat singh: అప్పుడు పుష్ప 2 కి జరిగింది.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి జరుగుతుంది

ముంబై కి చెందిన అయేషా ఖాన్ మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' తో 'ముఖచిత్రం' అనే మూవీలో చెయ్యడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. మొదటి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న అయేషా ఖాన్ సినీ అకౌంట్ లో  'ఓం భీం భూమ్ బుష్', గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,  మనమే వంటి చిత్రాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని, సన్నీడియోల్ ల 'జాట్' లో కూడా కానిస్టేబుల్ గా కనపడి మెస్మరైజ్ చేసింది.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com