
-టాక్సిక్, ధురంధర్ 2 కి షాక్
-అక్కడ ఇబ్బందులు తప్పవు
-ఫ్యాన్స్ లో నిరుత్సాహం ఎందుకు
-కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం ఏంటి!
అభిమానులు, మూవీ లవర్స్ తమ రోజు వారి పనులు చేసుకుంటూనే ధురంధర్ 2(Dhurandhar 2),టాక్సిక్ (Toxic)పై ఒక లుక్ వేస్తూనే ఉన్నారు. ఈ మాట విన్న వెంటనే ప్రేక్షకులు సైతం ఎంటర్ అయ్యి నీ కంటికి మేము కనపడటం లేదా, అక్కడుంది ఎలాంటి మూవీస్. మేము కూడా ట్రెండ్ కి తగ్గట్టే అప్ డేట్ అయ్యాం. కేవలం సినిమా అప్పుడే కాదు ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా హంగామా చేయడానికి రెడీ అయ్యాం అని అంటున్నారు. చెప్పినట్టుగానే చేస్తు రెండు సినిమాలు హిట్ అవ్వడంతో పాటు మంచి వసూళ్లు సాధించాలని కూడా కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆ రెండు చిత్రాలకి సంబంధించిన న్యూస్ ఒకటి వాళ్ళ ఆశలకి చోటా గండి కొట్టింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి ఏరియాస్ ని వార్ జోన్‌లోకి నెట్టాయి. దాంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఈ యుద్ధ వాతావరణం మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 19 న సదరు ఏరియాస్ లో టాక్సిక్, ధురంధర్ రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు.
also read: The Kerala story 2: రికార్డు కలెక్షన్స్ లో కేరళ స్టోరీ 2 .. ఆ మూడు సినిమాల కలెక్షన్స్ గల్లంతు
మన సినిమాలకి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచి వసూళ్లు వస్తుంటాయి. సౌదీ అరేబియా, ఖతార్ వంటి ప్రాంతాల్లో ఉన్న భారీ భారతీయ జనాభా కారణంగా రికార్డు వసూళ్లు గ్యారంటీ. ఈ విషయంలో సబ్జెట్ దృష్ట్యా ధురంధర్ 2 కి మామూలుగానే రిలీజ్ అవకాశం లేదు. కానీ ‘టాక్సిక్’కూడా ఆ మార్కెట్‌ని కోల్పోవాల్సి వచ్చింది. యుఎస్ లో డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బాక్సాఫీస్ ఓవరాల్ కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అరబ్ కంట్రీస్ కాకపోయినా మిగతా చోట్ల కూడా ధురంధర్ 2 కల్లెక్షన్స్ పై పడే అవకాశం ఉంది.







