Home

»

Latest News

Arjun Sarja: అర్జున్ చిన్నకుమార్తె అంజనా ప్రేమ పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Jun 4, 2026 3:32PM

 


యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా(Arjun Sarja)చిన్న కుమార్తె అంజనా సర్జా(Anjana sarja)ఈ ఏడాది అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న అంజనా ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సంపాదించారు. ఆమె స్థాపించిన ‘SARJAA’ బ్రాండ్ పర్యావరణహిత లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పండ్ల వ్యర్థాలు, యాపిల్, పైనాపిల్, కాక్టస్ వంటి సహజ పదార్థాలతో రూపొందించే ఈ బ్యాగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి.

అంజనా  ఓ అమెరికన్ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో చదువుకునే సమయంలో ప్రారంభమైన ఈ పరిచయం ప్రేమగా మారి, కాలక్రమేణా మరింత బలపడింది. గత ఏడాది ఇటలీలోని అందమైన పర్యాటక ప్రాంతం లేక్ కోమోలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ వేడుకని  అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించినట్లు వార్తలు సైతం వచ్చాయి. ఈ మేరకు అక్టోబర్ నెలలో వివాహం చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే  ఈ విషయంపై అర్జున్ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య ని హీరోయిన్ గా పరిచయం చేస్తు 'సీతాపయనం' అనే మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 

Also read: vijay deverakonda: గండికోటలో విజయ్ దేవరకొండ.. హై ఓల్టేజ్ యాక్షన్ రచ్చ


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com