Home

»

Latest News

Allu Arjun: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఆసక్తికర చర్చ.. తెలుగోళ్లు ఏమంటున్నారో తెలుసా!

Mar 09, 2026

 


-వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ 
-అందరిలో భారీ అంచనాలు 
-బసిల్ జోసెఫ్‌  ఎవరు


'ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)గురించి అభిమానుల్లో,ప్రేక్షకుల్లో నిత్యం నానుతుండే మాట ఈజీ యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్. ఆ ఈజీ యాక్టింగ్ తోనే  సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటు పాన్ ఇండియా లెవల్లో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రాండ్ సిల్వర్ స్క్రీన్ పై  తన అప్ కమింగ్ సినిమాల ద్వారా మరిన్ని సంచలనాలని సృష్టించడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
 

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా చిత్రీకరణ దశలో ఉంది. ఆ వెంటనే  'లోకేష్ కనగరాజ్'(Lokesh kanagaraj)తో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రం కూడా త్వరలోనే షూట్ కి వెళ్లనుంది. అట్లీ, లోకేష్ ఇద్దరు తమిళ దర్శకులు. కానీ ప్రస్తుతం నడుస్తుంది పాన్ ఇండియా ఫీవర్. ఆ ఇద్దరికి పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఉండటంతో తమిళ దర్శకులు అనే పాయింట్ పై ఎవరు ఫోకస్ చెయ్యలేదు. ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మలయాళ దర్శకుడు 'బసిల్ జోసెఫ్‌ తో చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో  సోషల్ మీడియా వేదికగా పలువురు తెలుగు సినిమా ప్రియులు స్పందిస్తు ఇప్పుడు తెలుగు దర్శకులు కూడా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు సృష్టించే సబ్జెట్స్ చేస్తున్నారు. వరుసగా పర బాషా దర్శకులు అయితే తెలుగు నేటి విటి స్టైల్ కోల్పోతుందేమో. ఎంత పాన్ ఇండియా అయినా తెలుగు కల్చర్ ఉండాలి కదా!. ఈ విషయంలో అల్లు అర్జున్ ఆలోచించాలని సోషల్ మీడియా వేదికగా విన్నపం చేస్తున్నారు. 

also read: trisha: క్షమాపణలు చెప్పిన అగ్ర హీరో.. త్రిష ఎఫెక్ట్    

నిజానికి అట్లీ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ డ్రాప్ అయ్యాడు. సందీప్ రెడ్డి వంగ తో అని కూడా వచ్చింది. అది కూడా మిడిల్ డ్రాప్. ఇప్పుడు బసిల్ జోసెఫ్‌(Basil Joseph)తో కన్ఫార్మ్ అనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకి బలాన్ని చేకూరుస్తు ఇటీవల జరిగిన అల్లు శిరీష్ పెళ్ళికి బసిల్ హాజరయ్యాడు.మరి అల్లు అర్జున్ మనసులో ఏముందో ఆయన చెప్తేనే గాని తెలుస్తుంది. బసిల్ మాత్రం కుంజిరామాయణం, గోధా, మిన్నల్ మురళి వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడుగా మంచి పేరు సంపాదించాడు. ముఖ్యంగా ‘మిన్నల్ మురళి’ తో దేశవ్యాప్తంగా బసిల్ పేరు మారుమోగిపోయింది. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com