Home

»

Latest News

Allu Arjun: నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అల్లు అర్హ.. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్ 

Mar 16, 2026

 

 

-అరుదైన ఘనత సాధించిన అల్లు అర్హ
-అభినందనల వెల్లువ 
-ఇంతకీ ఆ ఘనతేంటి

అల్లు అర్హ(Allu Arha).. ఇది కేవలం పేరు కాదు బ్రాండ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటు తగ్గేదెలే అనే రీతిలో తన క్యూట్ వీడియోస్ తో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. కొన్ని సందర్భాల్లో అయితే తన తండ్రి అల్లు అర్జున్ వీడియోస్ కంటే తన వీడియోస్ కే ఎక్కువ లైక్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్హ పాపులారిటీని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా అల్లు అర్హ అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకుంది. మరి ఆ చిచ్చరపిడుగు సాధించిన విజయమేంటో చూద్దాం.
 

అల్లు అర్హ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న'రాయ్ చెస్ అకాడమీ'లో 'చెస్ గేమ్' లో ట్రైనింగ్ తీసుకుంటుంది. సదరు గేమ్ లో ఎంతో ప్రావీణ్యురాలు. ఎంతలా అంటే చెస్ లో సుమారు యాభై మంది వరకు ట్రైనింగ్ ఇచ్చేంతలా. అవును తాను ఒక యాభై మంది వరకు ట్రైనింగ్ ఇచ్చింది. చెస్ ఎలా ఆడాలో, ఎలా ఆడితే విజేతగా నిలుస్తారో వాళ్ళకి క్షుణ్ణంగా వివరించినట్టు  సమాచారం. పైగా కేవలం రెండు నెలల్లోనే వాళ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో  చిన్న వయసులోనే  అంత మందికి ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా ప్రఖ్యాతి గాంచిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో  స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండంతో అభిమానులు, నెటిజన్స్ అర్హ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.

also read:  Arjun das: అర్జున్ దాస్ ఎమోషనల్ బ్రేక్ అప్ పోస్ట్.. ఆ హీరోయిన్ నేనా!

 ఫ్యూచర్ లో ఇండియాకి కూడా ఆడే విధంగా అర్హ ని మరింతగా ఎంకరేజ్ చెయ్యాలని అల్లు అర్జున్(Allu Arjun)ని కోరుతు మెసేజెస్ కూడా చేస్తున్నారు. అల్లు అర్హ వయసు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు. ఐదేళ్ల వయసులోను చెస్ శిక్షణ ఇచ్చినందుకు గతంలో కూడా   నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అర్హ స్థానాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com