రజనీకాంత్ రోబో-2 లో ధూమ్ 3 విలన్
Jul 21, 2014 10:46AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన రోబో బాలీవుడ్‌లోనూ హిట్ సాధించింది. శంకర్ అసలు ఈ చిత్రాన్ని షారుఖ్ తో ప్లాన్ చేసి, సినిమా షూటింగ్ కొత్త నిర్వహించిన అనంతరం షారుఖ్ ఖాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రోబో సాధించిన విజయం చూసి నాలుక కరుచుకున్నారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పడు లేటెస్టుగా రోబో 2 చిత్రానికి గాను బాలీవుడ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సారి అక్కడి హీరో ఇక్కడ విలన్ అవతారంలో కనిపించబోవటం ఇక్కడ గమ్మత్తు. ముందూగా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నటించబోతున్నాడని టాకు వచ్చింది. ఇప్పడు మిస్టర్ ఫర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ రజనీ సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో టాకు మొదలైంది. ధూమ్ 3 సినిమాతో నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ చెయ్యడంలోనూ బెస్టు అనిపించుకున్న అమీర్ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రకు బాగా సూట్ అవుతారని, అలాగే అమీర్, రజనీని ఒకే సినిమాలో కనిపిస్తే ఇక కాసుల వర్షమే అనే ఊహలు మొదలయ్యాయి.
మామూలుగా మల్టీ స్టారర్ మూవీలంటేనే విపరీతంగా క్రేజ్ పెరుగుతుంది. అలాంటిది రెండు పరిశ్రమలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి నటిస్తే ఇక తిరుగేం వుంటుంది. రోబో -2 గురించిన వివరాలు శంకర్ త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.



.jpg)
