మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. లక్కీ సీజన్లో వస్తాడా?
on May 18, 2020
ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ‘ఖయామత్ సే ఖయామత్ తక్’(1988)తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆమిర్.. రీసెంట్గా 32 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. తన నటప్రస్థానంలో అనేక రివార్డులను, అవార్డులను, రికార్డులను కైవసం చేసుకున్న ఆమిర్.. ఇప్పటికీ వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ విభిన్న పాత్రలతో ముందుకు సాగుతున్నాడు.
ఇదిలా ఉంటే.. గత చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’(2018) తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో నిర్మాణంలో ఉన్న ‘లాల్ సింగ్ చద్దా’ పైనే ఆశలు పెట్టుకున్నాడు ఆమిర్. అంతేకాదు.. ఈ సినిమాని తన లక్కీ సీజన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఆ సీజన్ మరేదో కాదు.. ‘క్రిస్మస్’.
ఈ సీజన్లో ఆమిర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ 'బ్లాక్‌బస్టర్' బాట పట్టాయి. ‘తారే జమీన్ పర్’ (2007), ‘గజిని’(2008), ‘త్రీ ఇడియట్స్’(2009), ‘ధూమ్ 3’(2013), ‘పీకే’(2014), ‘దంగల్’(2016).. ఇలా క్రిస్మస్ సీజన్లో వచ్చిన ఆమిర్ సినిమాలన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా ‘గజిని’, ‘త్రీ ఇడియట్స్’, ‘ధూమ్ 3’, ‘పీకే’, ‘దంగల్’ హిందీనాట హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. అంతేకాదు.. బాలీవుడ్‌కి తొలి రూ.100 కోట్ల చిత్రం (గజిని), తొలి రూ.200 కోట్ల చిత్రం (‘త్రీ ఇడియట్స్’).. ఇలా పలు రికార్డులు క్రిస్మస్ సీజన్లోనే నమోదవడం విశేషం.
ఈ నేపథ్యంలోనే.. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’(1994) స్పూర్తితో తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ని కూడా క్రిస్మస్ సీజన్లోనే రిలీజ్ చేయాలని ఆమిర్ అండ్ టీమ్ ప్లాన్ చేసింది. ఆమిర్‌కి కలిసొచ్చిన సీజన్ కావడంతో.. ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయమని ఆయన అభిమానులు కూడా భావించారు. అయితే, అనూహ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ మిస్ అయ్యింది.
మరి, బౌన్స్ బ్యాక్ అవ్వడానికి లక్కీ సీజన్‌ని ఎంచుకున్న ఆమిర్.. సకాలంలో వెండితెరపై వెలుగులు పంచుతాడా? లేదా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.