Home

»

Latest News

ఆకాశంలో ఒక తార: విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్.. షాక్‌లో ఇండస్ట్రీ.!

Oct 19, 2026 12:46PM

సినిమా అంటే కోట్ల రూపాయల పెట్టుబడి.. ఆ తర్వాత ప్రమోషన్లు, థియేట్రికల్ బిజినెస్, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు. హిట్ అయితేనే నిర్మాతకు లాభాలు వస్తాయనే లెక్కలు చాలాసార్లు కనిపిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం విడుదలకు ముందే లెక్కలన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి వ్యోమగామి కావాలనే కలను నెరవేర్చుకునేందుకు చేసే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ కథలో దుల్కర్ పాత్ర ఆమె కలకు అండగా నిలిచే వ్యక్తిగా కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ నిర్మాతలకు మంచి ఊరటనిచ్చినట్టు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌తో ఇప్పటికే ఓటీటీ డీల్ పూర్తయింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు కాగా, నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో ఆ పెట్టుబడి విడుదలకు ముందే తిరిగి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలు నిజమైతే.. థియేటర్లలో సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టీజర్‌లోనే కథలోని ప్రధాన సంఘర్షణను చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు దర్శకుడు పవన్ సాధినేని. ఒక అమ్మాయి తన కలను నెరవేర్చుకోవడానికి సమాజం నుంచి ఎదురయ్యే అడ్డంకులను ఎలా దాటుతుంది? ఆమె ప్రయాణంలో దుల్కర్ పాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనే అంశాలపై క్యూరియాసిటీ పెరిగేలా టీజర్ ఉంది. ఈ సినిమా నవంబర్ 20, 2026న థియేటర్లలోకి రానుంది.

ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అవార్డులు, రివార్డులు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: RAPO23లో రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ పోతినేని దర్శకత్వంలో జెనీలియా భర్త.!

 

 

 

[Aakasamlo Oka Tara Table Profit Venture, Aakasamlo Oka Tara 60 Crore Business, Aakasamlo Oka Tara OTT Deal, Aakasamlo Oka Tara Netflix, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan, Satvika Veeravalli, Pavan Sadineni, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com