ధైర్యం చేయలేకపోయిన నాని
on Apr 28, 2025
నాచురల్ స్టార్ నాని(Nani)వన్ మాన్ షో 'హిట్ 3 '(Hit 3)మే 1 న పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ప్రచార చిత్రాలతో హిట్ 3 పై నాని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli)ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
'హిట్ 3 ' గురించి నాని మాట్లాడుతు మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. నేను గతంలో నా నిర్మాణ సారధ్యంలో వచ్చిన 'కోర్ట్' మూవీ గురించి మీకో ప్రామిస్ చేశాను. మూవీ నేను చెప్పినట్టుగా ఉండకపోతే హిట్ 3 చూడవద్దని చెప్పాను. ఇప్పుడు హిట్ 3 బాగోకపోతే ssmb 29 ని చూడవద్దని నాని చెప్దామనుకున్నాడు. కానీ ఆ వెంటనే ssmb 29 ని నా హిట్ 3 గురించి తాకట్టు పెట్టినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ssmb 29 కోసం ఇండియానే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని చెప్పుకొచ్చాడు.
ఇక హిట్ 3 లో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి(Srinidhi shetty)హీరోయిన్ గా చేస్తుండగా సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించాడు. వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని సుమారు 60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా హిట్ 1 , హిట్ 2 ,సైంధవ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను(Sailesh KOlanu)దర్శకత్వం వహించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
