రోడ్డు ప్రమాదంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మృతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ క్రీడాకారిణి దుర్మరణం పాలైంది. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సత్యజ్యోతి విజయనగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లిమర మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన శివజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారణి. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు కోసం తన సోదరి గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరారు

. విజయనగరం సమీపంలోని వైఎస్‌ఆర్ నగర్ దాటిన తర్వాత, ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరి గాయత్రి గాయపడ్డారు. ప్రతిభామంతురాలైన క్రీడాకారిణి సత్యజ్యోతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడంతో  ఆమె స్వగ్రామం కొండవెలగాడలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. సత్యజ్యోతి మృతి పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu