బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. సిట్ విచారణకు రానా దగ్గుబాటి, విష్ణు ప్రియ

తెలంగాణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో  ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియలు శనివారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.  విష్ణు ప్రియ   మూడు బెట్టింగ్ యాప్ లను   ప్రమోట్ చేసినట్లుగా సిట్ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే   ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.  విచారణ సందర్భంగా విష్ణుప్రియ తన బ్యాంక్ అక్కౌంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లను సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది.

అలాగే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం ఆమె కుదుర్చుకున్న ఒప్పందాలపై సిట్ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ ద్వారా విష్ణుప్రియకు చెల్లింపులు ఎలా, ఎవరి ద్వారా అందాయి అన్న విషయాలపై సిట్ ఈ విచారణలో ఆరా తీసినట్లు తెలిపింది. 

కాగా  ప్రముఖ హీరో దగ్గుబాటి రానా కూడా శనివారం ఈ కేసులో విచారణకు సిట్ ఎదుట హాజరయ్యారు. రానా కూడా తన బ్యాంక్ స్టేట్ మెంట్లు సిట్ కు సమర్పించారు. తాను ప్రమోట్ చేసింది స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ మాత్రమే ననీ, అది చట్టవిరుద్ధం కాదని రానా తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది.న 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu