లెజెండ్ సినిమా ఆపేయ్యాలంట !
on Apr 25, 2014
బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నుంచి పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సినిమా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా సినిమా ఆపేయాలని వారు ఫిర్యాదు చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారులు నిన్న "లెజెండ్" చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమాపై ఓ నివేదికను తయారు చేసి ఎన్నికల ప్రధానాధికారికి అందజేయనున్నారు. మరి ఈ సినిమాపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే తెలియనుంది.