రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ ప్రారంభం
on Apr 25, 2014
రాజశేఖర్ కథానాయకుడిగా "గడ్డం గ్యాంగ్" అనే చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో జరిగాయి. తమిళంలో విజయవంతమైన "సూదుకవ్వమ్" అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఆద్యంతం వినోదం, ఉత్కంటని అందించే ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు శరవణన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శివాణి శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రాజశేఖర్ సరసన "పంజా" ఫేం అంజలి లవానియా హీరోయిన్ గా నటించనుంది. సంగీతం అచ్చు.