ఇంట్లోనే బాలకృష్ణ షష్టిపూర్తి వేడుకలు!?
on Jun 3, 2020

కథానాయకుడు, ప్రజానాయకుడు, ప్రస్తుతం హిందూపూర్ శాసనసభ ఎమ్మెల్యే నటసింహ నందమూరి బాలకృష్ణ షష్టిపూర్తి వేడుకలను ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించాలని అనుకుంటున్నారట. కరోనా నేపథ్యంలో పరిస్థితులు రోజు రోజుకీ మారుతున్నాయి. అభిమాన సందోహం నడుమ వేడుకలు నిర్వహించే పరిస్థితి లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం బాలకృష్ణకు 59 సంవత్సరాలు. ఈ నెల 10వ తేదీకి ఆయనకు 60 ఏళ్ళు వస్తాయి. ఈ రోజు ఇంట్లో చిన్న ఈవెంట్ ప్లాన్ చేశారట.
సోదర సోదరీమణులు, అతికొద్ది మంది సన్నిహితులతో ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నారట. ఆయన కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్ళు నారా లోకేష్, భరత్ షష్టిపూర్తి వేడుక ఏర్పాట్లను స్వయంగా చూసుకోనున్నారని సమాచారం. ప్రభుత్వ నిబంధనలను బట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అతికొద్ది మంది సన్నిహితులను ఆహ్వానించాలని అనుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



