బాలకృష్ణ పుట్టినరోజుకి కానుక అదేనా?
on May 30, 2020

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుకు పట్టుమని రెండు వారాలు కూడా లేదు. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు. ఆ రోజు అభిమానులకు కానుక ఇవ్వాలని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నట్టు సమాచారం. ‘సింహా’, ‘లెజెండ్’ భారీ విజయాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందులో బాలకృష్ణ రెండు గెటప్పులో కనిపించనున్నారు. రెండిటిలో ఒకటి అఘోరా గెటప్. దానికోసం కూడా రెండుమూడు లుక్కులు అనుకుంటున్నారట.
లెటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తాజా చిత్రానికి ‘మోనార్క్’ టైటిల్ ఖరారు చేశారట. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ ఏడాది బర్త్‌డే బాలయ్యతో పాటు అభిమానులకు చాలా స్పెషల్. ఇప్పుడు నటసింహానికి 59 సంవత్సరాలు. జూన్ 10న ఆయన 60వ పడిలో అడుగుపెడతారు. అందుకని, గ్రాండ్‌గా అభిమానులు పండగ చేసుకొనేలా లుక్ రిలీజ్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



