టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలయ్య?
on May 12, 2020

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంతకు ముందు తండ్రి పాత్రలు చేశారు. కానీ, ఇంతవరకు మరోక నటుడు/నటికి తండ్రిగా నటించలేదు. ఆయన ద్విపాత్రాభినయం చేసినప్పుడు రెండు పాత్రలో ఒకటి తండ్రి అయితే, మరొకటి కొడుకు పాత్రగా ఉండేది. ఉదాహరణకు 'చెన్నకేశవరెడ్డి'లో రెండు క్యారెక్టర్లును చెప్పుకోవచ్చు. అన్నీ కుదిరితే... తొలిసారి ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించడానికి త్వరలో బాలకృష్ణ రెడీ అవుతారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏదీ ఇంకా ఖరారు కాలేదు. కానీ, కొందరు దర్శకులు ఆయన చుట్టూ కథలు పట్టుకుని తిరుగుతున్నారు. అందులో బి. గోపాల్ ఒకరు. బాలకృష్ణ హీరోగా 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి హిట్ ఫిలిమ్స్ ఆయన చేశారు. ఇప్పుడు సాయిమాధవ్ బుర్రా రాసిన కథతో దగ్గరకు వెళ్లారట. తండ్రీకూతుళ్ల స్టోరీ లైన్ విన్న బాలకృష్ణ, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని అడిగారట. ఆయనకు నచ్చితే సినిమా చేస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



