లెజెండ్ స్పందనకు టాలీవుడ్ మైండ్ బ్లాంక్
on Mar 6, 2014
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న బాలయ్య "లెజెండ్" చిత్రం రోజురోజుకి అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, స్మాల్ టీజర్ ఇటీవలే విడుదలయ్యాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్ చూసినవాళ్ళందరికీ అర్థమయ్యింది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఈ టీజర్ లోనే చింపేసాడు. ఇక సినిమాలో దేవి ఎలాంటి మ్యాజిక్ చేసాడో, ఎలాంటి పాటలు ఇచ్చాడో మరికొద్ది రోజుల్లోనే త్వరలోనే తెలియనున్నాయి.
"సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత బాలయ్యతో చేస్తున్న రెండో చిత్రం కావడం వలన దర్శకుడు బోయపాటి ఓ సవాల్ గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు(మార్చి 7) సాయంత్రం శిల్పకళావేదికలో విడుదల కానుంది. ఈరోజు ఉదయం ఈ సినిమా ఆడియో పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మార్చి 28న లేదా ఏప్రిల్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు.