మార్చి16 నుండి రభస షూటింగ్
on Mar 6, 2014
"రామయ్య వస్తావయ్యా" తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న"రభస" చిత్ర మరో షెడ్యుల్ మార్చి16 నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యుల్ పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తయినట్లే అని తెలిసింది. ఇటీవలే దర్శకుడి అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆపేసారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో తారక్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.