లెజెండ్ లో రెండు సింహాలు...!
on Dec 19, 2013
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో "లెజెండ్" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు.గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల కార్యక్రమం జరుపనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.