Home

»

Gossips

టాలీవుడ్‌లో భారీ మైథలాజికల్ మూవీ: శ్రీవిష్ణుతో ‘రంగబలి’ డైరెక్టర్ బిగ్ స్కెచ్.!

Oct 23, 2026 12:50PM

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో కొత్త జానర్‌లోకి అడుగుపెట్టబోతున్నారా? ఇప్పటివరకు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ కథలతో మెప్పించిన ఈ నటుడు.. ఈసారి మైథలాజికల్ అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టితో శ్రీవిష్ణు ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.

ఈ సినిమా నిజంగా మైథలాజికల్ అడ్వెంచర్ కథతో తెరకెక్కితే.. శ్రీవిష్ణు కెరీర్‌లో ఇది భిన్నమైన ప్రయత్నం కానుంది. అయితే కథ, ఆయన పాత్ర, ఇతర నటీనటులు, చిత్రీకరణ ప్రారంభం వంటి వివరాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు శ్రీవిష్ణు నటిస్తున్న ‘ఫ్యామిలీ ప్యాక్’ సంక్రాంతి 2027 విడుదల లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఈ మైథలాజికల్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఓ ప్రాజెక్ట్ లైన్ లో ఉండనే ప్రచారం కూడా వినిపిస్తోంది. శ్రీవిష్ణు-వివేక్ ఆత్రేయ కాంబోలో గతంలో 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' సినిమాలు వచ్చాయి.

ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాలిస్తే శ్రీవిష్ణు లైనప్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా పౌరాణిక కథలో ఆయనను ఎలా చూపించబోతున్నారు? కామెడీకి భిన్నంగా కొత్త అవతారంలో కనిపిస్తారా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇది కూడా చదవండి: నాని స్టార్ పవర్.. నెట్‌ఫ్లిక్స్‌ టాప్ ట్రెండింగ్‌లో ప్యారడైజ్.!

 

 

 

[Sree Vishnu Next Movie, Mythological Adventure, Rangabali Director Pawan Basamsetti, Telugu Mythology, Sree Vishnu, Pawan Basamsetti, Family Pack Movie, Vivek Athreya, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com