Home

»

Gossips

థ్రిల్లర్ కథకు ఓకే చెప్పిన ప్రభాస్: డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు.!

Oct 23, 2026 11:16AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పటికే భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారంటే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. 

‘మిరాయ్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. ప్రభాస్ కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’, ‘మిరాయ్’ సినిమాలతో తనదైన టెక్నికల్ మేకింగ్‌ను చూపించారు. ముఖ్యంగా ‘మిరాయ్’లో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్‌తో థ్రిల్లర్ సినిమా రూపొందిస్తే అది ఏ తరహాలో ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఇప్పటికే ఉన్న సినిమాల షెడ్యూల్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే కార్తీక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.?

 

 

 

[Prabhas New Movie, Prabhas Thriller Movie, Mirai Director, Karthik Gattamneni, People Media Factory, Prabhas Movies, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com