Home

»

Gossips

Peddi: జూన్ 25 కాదు.. మళ్ళీ మారుతున్న 'పెద్ది' రిలీజ్ డేట్!

Apr 29, 2026

2026 జూన్ నెలలో రిలీజ్ కానున్న భారీ చిత్రాల విడుదల తేదీల విషయంలో గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, యశ్ సినిమాల మధ్య జరుగుతున్న ఈ రిలీజ్ డేట్ గేమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

బుచ్చిబాబు ప్రకటనతో మొదలైన అలజడి
ఇటీవల జరిగిన 'కర' మూవీ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాను జూన్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే, అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' (LENIN) మూవీ జూన్ 26న విడుదల కావాల్సి ఉంది. చరణ్ సినిమాతో పోటీ పడటం ఎందుకని 'లెనిన్' వాయిదా పడుతుందనే ప్రచారం జోరుగా సాగింది.

నాగార్జున క్లారిటీ.. తగ్గేదే లే!
అయితే, ఈ పుకార్లకు కింగ్ నాగార్జున తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'లెనిన్' ఫస్ట్ కట్ చూశానని, సినిమా అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. అంతేకాకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 26, 2026న 'లెనిన్' థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో జూన్ ఆఖరి వారంలో రామ్ చరణ్ vs అఖిల్ పోరు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.

టాక్సిక్ వాయిదా.. పెద్దికి అడ్వాంటేజ్?
మరోవైపు, జూన్ 4న విడుదల కావాల్సిన యశ్ 'టాక్సిక్' (Toxic) మూవీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కారణాలతో వాయిదా పడింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు 'పెద్ది' మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ 'పెద్ది' జూన్ 4కి వస్తే, అఖిల్ 'లెనిన్'కు సోలో రిలీజ్ దక్కుతుంది. కానీ బుచ్చిబాబు జూన్ 25 అని చెప్పడంతో ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

'పెద్ది' రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి బుచ్చిబాబు చెప్పినట్టుగా జూన్ 25న వచ్చి 'లెనిన్'కి షాక్ ఇస్తుందో లేక 'టాక్సిక్' తప్పుకోవడంతో ఖాళీ అయిన జూన్ 4 కి వస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com