Home

»

Gossips

అయ్యప్ప స్వామి జీవిత చరిత్రతో పాన్ ఇండియా మూవీ:తెరపైకి ఆ స్టార్ హీరో పేరు

Nov 17, 2026 11:17AM

హరిహర సుతుడు అయ్యప్ప.. ఈ పేరు వింటే అయ్యప్ప భక్తులు ఎంతగా పులకరించిపోతారో చెప్పక్కర్లేదు. స్వామియే శరణమయ్యప్ప అంటూ తమ మనసు నిండా  ఆ మణికంఠుడుని స్మరించుకుంటూ ఉంటారు. సెల్యులాయిడ్ సైతం స్వామియే శరణమయ్యప్ప అంటు అయ్యప్పని బేస్ చేసుకొని కొన్ని చిత్రాలు తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న ఇరుముడి కథ ఆత్మ యొక్క పరమార్ధం కూడా అయ్యప్పనే.   


 ఈ క్రమంలోనే ఇప్పుడు దక్షిణాది ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది. శబరిమల అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర నేపథ్యంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ రూపొందబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.అయ్యప్ప స్వామి జననం, పందళ రాజుల పెంపకం, గురుకుల విద్య, మహిషి సంహారం,శబరిమల క్షేత్ర ఆవిర్భావం వంటి అద్భుత ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టాలీవుడ్‌కి  చెందిన ఒక స్టార్ హీరో చేయబోతున్నాడనే  రూమర్ సినీ వర్గాల్లో జెట్ స్పీడ్ వేగంతో చక్కర్లు కొడుతుంది.  అయ్యప్ప దీక్షని  ఎంతో నిష్టతో ఆచరించిన ఆ అగ్ర కథానాయకుడు అయితేనే పూర్తి న్యాయం చేయగలరని మేకర్స్ భావిస్తున్నారట.గతంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అయ్యప్ప స్వామి మహత్యంపై పలు చిత్రాలు వచ్చాయి. 1989లో శరత్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన 'అయ్యప్ప స్వామి మహత్యం' సినిమా అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, నేటి ఆధునిక వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దివ్య గాథను వెండితెరపై ఆవిష్కరించాలని ఈ కొత్త ప్రాజెక్ట్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇటీవల ఇదే తరహాలో 'ఆర్య కేరళ వర్మన్' పేరుతో అయ్యప్ప స్వామి జీవితంలోని చారిత్రక కోణాలను ఆవిష్కరించేలా పాన్ ఇండియా స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ తాజా రూమర్ ప్రకారం, దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ముఖ్యంగా ప్రతి ఏటా శబరిమల యాత్రకు వెళ్లే కోట్లాది మంది అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకుని, అత్యంత భక్తిశ్రద్ధలతో, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ఈ కథను తీర్చిదిద్దుతున్నారని టాక్. 

సదరు స్టార్ హీరో కూడా ఈ కథ విని ఎంతో ఎగ్జైట్ అయ్యారని, తన తదుపరి సినిమాల షెడ్యూల్స్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద మరో భారీ ఆధ్యాత్మిక సంచలనం నమోదవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయ్యప్ప భక్తులైతే రూమర్ ని నిజం చేయమని శరణఘోష చెప్పుకుంటున్నారు.

 

మీకు నచ్చవచ్చు:రామాయణ కలెక్షన్స్ పరిస్థితి ఇదే!
మీకు నచ్చవచ్చు:ఉపాసన కొణిదెల తాజా వ్యాఖ్యలు వైరల్!

 

[Ayyappa Swamy Biopic, Sabarimala Ayyappa, Bada Hero, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com