మెగా ట్విస్ట్: ‘వారణాసి’ రిలీజ్ డేట్‌కి ‘కాకా’.!
Nov 27, 2026 6:34PM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న విడుదల తేదీకి కాకుండా, ఇప్పుడు మరో తేదీని టార్గెట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ‘కాకా’ సినిమాను ఏప్రిల్ 7, 2027న విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇదే తేదీన రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ విడుదలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘వారణాసి’ ఆగష్టుకి వాయిదా పడుతుందనే వార్తల నేపథ్యంలో.. ఇప్పుడు ‘కాకా’ ఆ తేదీని టార్గెట్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటమే ‘కాకా’ వాయిదాకు కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌కు సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయట. క్లైమాక్స్ స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకెళ్తున్నారని టాక్. అందుకే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
.webp)
మరోవైపు చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాపై కూడా కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ‘కాకా’ స్థానంలో 2027 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఎట్టకేలకు రూట్ క్లియర్ చేసుకుందని వినికిడి.
ఇది కూడా చదవండి: సందీప్ రెడ్డి వైరల్ కామెంట్స్.. హాలీవుడ్ స్టార్స్ కంటే చిరంజీవి గొప్ప.!
ఒకవైపు ‘కాకా’ను ఏప్రిల్ 7న విడుదల చేయాలనే ఆలోచన, మరోవైపు ‘విశ్వంభర’ను సంక్రాంతి బరిలో దింపాలనే ప్లాన్.. ఇలా చిరంజీవి నుంచి వచ్చే సినిమాల విడుదల తేదీలపై ఆసక్తి పెరుగుతోంది.

అయితే ‘కాకా’ ఏప్రిల్ 7 విడుదల తేదీ, ‘విశ్వంభర’ సంక్రాంతి రిలీజ్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
బాహుబలి కాంబో రిపీట్.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!
బ్రహ్మమొక్కటే.. స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య కీర్తన.!
[Chiranjeevi, Kaaka Movie, Vishwambhara, Varanasi, Mahesh Babu, SS Rajamouli]



